Facebook Twitter
కన్నీళ్ళు కడివెడు కష్టాలు పుట్టెడు 

కంటి నొప్పివచ్చినా 

పంటి నొప్పివచ్చినా

కాలినొప్పి వచ్చినా 

కడుపునొప్పి వచ్చినా 

గుట్టుగా 

గుండెనొప్పి వచ్చినా 

ఖర్మకాలి 

ఆపరేషన్ చేయాల్సి వస్తే

ఒక్కరోజులో -  ఖర్చు లక్షలు

 

కాని సంవత్సరమంతా 

ఏ జబ్బులు రాకుండా 

మీ జేబులోడబ్బులు

 ఖర్చుకాకుండా 

మీ ఇంటిళ్లిపాదిని కాపాడి  

చక్కని ఆరోగ్యాన్నియిచ్చిన 

మీరు నచ్చిన మీ దైవానికి 

 

సంవత్సరానికి 

ఒక్కసారి ఒకే ఒక్కసారి 

ఒక్కవెయ్యిరూపాయలు 

ఖర్చుపెట్టడానికి 

వెనుకాడుతున్నారా

ఆడబ్బును కూడా 

వెనకేసుకుంటున్నారా 

తప్పు పెద్ద తప్పు 

 

కృతజ్ఞతంటూ లేనివారు

కృతజ్ఞతాస్తుతులు 

చెల్లించనివారు

చేసిన మేలును మరిచేవారు

నేడు దాచుకున్నదానికి 

పదిరెట్లు 

రేపు ఖర్చుపెట్టాల్సివస్తుంది 

 

అప్పుడు 

కన్నీళ్ళు కడివెడు

కష్టాలు పుట్టెడు జాగ్రత్త మరి