వంద సమస్యలొక్కసారే వొస్తే?
యింటిలోకి
ఒక్క పామొస్తే
"పట్టుకోవచ్చు"..........
కాని... ఒక్కసారే
వంద పాములొస్తే ?
ఏదైనా ఒక్క
సమస్య వస్తే
"తట్టుకోవచ్చు"...........
కాని...ఒక్కసారే
వంద సమస్యలొస్తే ?
ఎప్పుడైనా
వరదలొచ్చి
ఇల్లు కూలిపోయినా
అగ్ని ప్రమాదంలో
ఇల్లు కాలిపోయినా
తిరిగి"కట్టుకోవచ్చు".........
కాని....ఒక్కసారే
భయంకరమైన భూకంపమొచ్చి
ఇల్లు పూర్తిగా నేలమట్టమైతే ?
ఉండేందుకు ఇళ్ళులేకున్నా
తినేందుకు తిండిలేకున్నా
అనారోగ్యంతోఆసుపత్రి పాలైతే
అప్పైనా చేసి ఆసుపత్రిబిల్లుల్ని
"కట్టుకోవచ్చు"..........
కాని.... ఒక్కసారే అకస్మాత్తుగా
మాయదారి రోగమొచ్చి
ఆపరేషన్ కు లక్షలు లక్షలు
ఖర్చు పెట్టాల్సి వస్తే ?
ఎవరు దిక్కు ?ఆదైవం తప్ప
ఔను మనందరిని అన్నింటా
ఆదుకోనేవాడా పరమాత్మ ఒక్కడే
అందుకే నీ చేతిలో నా చేతిలో
ఏముంది నిమ్మకాయ పులుసు
అది నీకు నాకు ముందే తెలుసు



