పిచ్చి ప్రేమంటే..
చూసే చూపుల్లో.........బిత్తర
నడిచే నడకలో... ......తత్తర
మాట్లాడేమాటల్లో.......తడబాటు
చెప్పేసమాధానాలు... పొరబాటు
ఇంతటి వింత మార్పెందుకు వస్తుంది?
కానీ, ఏదైనా ఒక తప్పు చేయాలనే
ఆలోచన వచ్చినప్పుడు
ఎన్ని పిచ్చిపిచ్చి ప్రశ్నల్ని
ఎంత గుచ్చిగుచ్చి అడిగినా
ఖచ్చితమైన సమాధానం లేనిదే ...రానిదే...
అది అగ్నిగుండం కంటే
అతిభయంకరం
రేయింబవళ్లు రెచ్చిపోతూ
పంట పొలాల వెంట
ఎవరి కంట పడకుండా
పార్కుల వెంట సిగ్గు లజ్జా లేకుండా
లాడ్జిలవెంట రహదారుల వెంట
బరితెగించి తిరిగే జంటల మధ్య పుట్టే
ఆ పిచ్చి ప్రేమ
ఊహల్లో పుట్టే ప్రేమకన్నా ప్రమాదం
ఆ ప్రేమంటే
ఆకర్షణ ఆజ్యముతో మండే ఆ ప్రేమంటే
అది అగ్నిగుండం కంటే అతి భయంకరం
ప్రేమంటే రెచ్చిపోవడం చచ్చిపోవడం కాదు
చచ్చిసాధించేదేమీలేదని తెలుసుకోవడమే
ప్రేమంటే ఒకరిలో ఒకరు సగభాగం
వివాహమైతే ఒక భోగం విఫలమైతే ఒకత్యాగం



