Facebook Twitter
ఎందుకు ఎందుకు ఎందుకు

ప్రేమించే వయసు వచ్చిందా లేదా 

ప్రేమించే పిల్ల నచ్చిందా లేదా 

అసలు అది నిజమైన ప్రేమా?లేక 

అర్థం లేని ఆకర్షణా ?

అది తొలి పరిచయమా ? లేక 

కళ్ళు పొరలుకమ్మిన కామమా?

ప్రేమించిన వాన్ని ఒక్కసారైనా  

చూడాలని seeకలసి మాట్లాడాలని 

కలలు కనడమెందుకు ?

వాడి పిలుపుకోసం 

తహతహలాడి పోవడమెందుకు 

తపించడం జపించడమెందుకు? 

ప్రియురాలి రాకకోసం లేదా 

లేఖకోసం ఒళ్ళంతా కళ్ళుచేసుకుని 

నిరీక్షించడమెందుకు ?

చదివేచదువు బుర్రకెక్కక పోవడం 

తిన్నతిండి సహించకపోవడం 

కాళ్లుచేతుల్లో చమటలు పట్టడం 

ఊపిరాడకపోవడం

ఉక్కిరిబిక్కిరి కావడమెందుకు?

అహోరాత్రులు అష్టకష్టాలుపడి 

కని పెంచినవాళ్ళసలు 

గుర్తుకు రాకపోవడమేమిటి ?

అమ్మానాన్నల అక్కాచెల్లెళ్ల 

అన్నాతమ్ముళ్ళ స్నేహితుల 

శ్రేయోభిలాషుల బంధువుల 

సలహాలు చెవికెక్కక పోవడమేమిటి ?