Facebook Twitter
పాలకుండలో విషపుచుక్క

ఓ అమ్మాయిల్లారా ! 

ఓ అబ్బాయిల్లారా ! 

పిచ్చి ప్రేమకు స్వచ్ఛమైన

ప్రేమకు అర్థం తెలియని 

ఓ అమాయకపు ప్రేమికుల్లారా ! 

పార్కులో స్వేచ్ఛగా విహరించే 

ఓ ప్రేమపక్షుల్లారా ! బరితెగించి 

బజారులో తిరిగే ముందు 

సిగ్గు లజ్జా లేకుండా 

చీకట్లో సరసాలాడే ముందు 

చిరునవ్వులు చిందిస్తూ 

గాలిలో తేలిపోయే ముందు 

స్వేచ్ఛగా విహంగాల్లా 

పార్కులో విహరించే ముందు

ఒక్కసారి ముఖాముఖిగా 

నిర్మొహమాటంగా 

గుండెల మీద చేయివేసుకుని 

ఒకరిని ఒకరు 

నిజాయితీగా ప్రశ్నించుకోండి

 

మిమ్ము మురిపించే మీ పై కురిపించే 

ఆ ప్రేమ అమ్మపాలలా స్వచ్ఛమైనదా

లేక అందులో కల్తీ ఉందా అని.

పాలకుండలో పడితే చాలదా

ఒక్క విషపుచుక్క

పాలన్నీ విషతుల్యమై పోవడానికి

కల్తీ ప్రేమంటే అంతే మరి 

ఒక విషపు చుక్కతో సమానం

పాలకుండలాంటి జీవితం 

నరక ప్రాయమైపోవడానికి

బంగారు భవిష్యత్తు భగ్నమైపోవడానికి 

బ్రతుకు బలై పోవడానికి 

పరువు గంగలో కలిసి పోవడానికి.

 

అందుకే,పార్కులో స్వేచ్ఛగా తిరిగే 

ఓ ప్రేమపక్షుల్లారా ! జాగ్రత్త ! 

జీవితానికి చిచ్చుపెట్టె పిచ్చి ప్రేమకు 

ఈ రోజే పులుస్టాప్ పెట్టండి !  

ఓ అమాయకపు అమ్మాయిల్లారా! 

ప్రేమ పేరుతో పచ్చిమోసగాళ్లు విసిరే 

కామపు వలల్లో కళ్ళు మూసుకొని 

చిక్కుకోకండి, కాలుజారకండి

తప్పుచేసి తల్లిదండ్రులకు 

తలవంపులు తేకండి 

స్వచ్ఛమైన ప్రేమైతే స్వాగతం 

పలకండి హారతి పట్టండి, కానీ 

నీచమైన కల్తీప్రేమకు మాత్రం 

నిర్మొహమాటంగా 

నో చెప్పండి ఆదిలోనే చెక్ పెట్టండి 

గులాబీలు పట్టుకొని నక్కినక్కి మీ ప్రక్కనే 

గుంటనక్కలు కొన్నితిరుగుతూ ఉంటాయన్న

ఓ *నగర నిజం* తెలుసుకోండి, ఇకనైనా ఈ

కంప్యూటర్ యుగంలోనైనా కళ్ళుతెరుచుకోండి