ఓ మిత్రమా !
ఓ నవ్వుల నేస్తమా!
ఓ ప్రేమ పుష్పమా !!
గత సంవత్సరపు గాయాలకు ...
మనస్పర్థలకు "మాటలమందు" రాసుకుందాం...
మనసున ''ప్రేమపూలు" పూయిద్దాం...
బాధపడిన ఆ క్షణాలను...మరిచిపోదాం...
ఆనందంగా పకపకమని...పెద్దగా నవ్వుకున్న
ఎన్నోగంటల్ని...
భావాలను పంచుకున్న
ఎన్నో మంచిరోజుల్ని గుర్తు చేసుకుందాం...
చేయీ చేయీ కలుపుదాం...
హాయి హాయిగా ఉందాం...
రేపేమి జరుగుతుందో ఎవరికెరుక...
ఆ పరమాత్మకు తప్ప...
రేపు ఒకరిని ఒకరం కలుసుకో గలమోలేదో...
రేపు ప్రేమగా పలకరించుకో గలమోలేదో...
రేపు మనసులోని భావాలను తృప్తిగా
పంచుకోగలమోలేదో...
రేపు ఒకరిని ఒకరం ఓదార్చుకోగలమోలేదో
రేపు పెద్దగా నవ్వుకోగలమోలేదో...
రేపు కట్టుకుపోయేది...
చేతపట్టుకు పోయేదేముంది... చెప్పండి...
వాడా... చాలా మంచోడురా...అని ప్రాణమిత్రులు...
వారా...ఎంతో గొప్ప మంచి
మనసున్న మహరాజురా...అని శ్రేయోభిలాషులు...
అనుకుంటే చాలదా...అంతకంటే ఇంకేం కావాలి జీవితానికి...
"మరణంలేనిది స్నేహమొక్కటేనని" మరవరాదు మనం
ఏమంటారు... మిత్రమా...ఔనంటారా... కాదంటారా...
మిమ్మల్ని ఎన్నటికీ మరువని...
మీ ఆత్మీయ అభిమాని...
మీ శ్రేయోభిలాషి...
మీ పోలన్నకవి కూకట్లపల్లి.. హైదరాబాద్



