వంద ఆలోచనలకన్నా ఒక్క ఆచరణమిన్న
ఆత్మవిశ్వాసమే ఊపరైతే
ఎంతటి ఘనవిజయాన్నైనా సాధించవచ్చు
ప్రతిమనిషి ఒక లక్ష్యం ఉండాలి
దాన్నే నిత్యం ధ్యానించాలి
దాన్నే దర్శించాలి దానికోసమే జీవించాలి
సత్కార్యానికి ప్రతిరోజూ మంచిరోజే
ప్రతిఘడియ శుభఘడియే
ప్రతిముహూర్తం మంచి ముహూర్తమే
కాలం వజ్రంకన్న విలువైనది కాలదన్న రాదు
హీరోలమైనా మన జీవితాలను జీరో చేస్తుంది
సందేహరాయుళ్ళు
మొహమాటపడేవాళ్ళు జీవితంలో
ఎప్పటికీ ఎదగలేరు పేదవాళ్లగానే మిగిలిపోతారు
ఫలితం ఆశించక శ్రమించి కృషిచేయాలి
ఒకనాటికి ఆ శ్రమే ఊహించని
ఫలితాలనిస్తుంది గొప్పగుర్తింపును తెస్తుంది
నేడు అద్భుతాలు సృష్టించినవారంతా,నిన్న
ఆర్థికంగా చితికిపోయినవారే,కాని ఆశ చావనివారే
లక్ష్యసాధనకు దృఢమైన నమ్మకముండాలి
గట్టిపట్టుదల కృషి సాధించి తీరాలన్న తపనఉండాలి
బద్దకం మనిషికి బద్దశత్రువే కాదు
అది ఒక ఊబిలాంటిది అది ఒక సజీవ సమాధిలాంటిది దాన్ని ఆశ్రయిస్తే అది నిన్ను మొక్కలా ఎదగనివ్వకపోగా
అధఃపాతాళానికి అణగద్రొక్కుతుంది తస్మాత్ జాగ్రత్త !



