ఓ మనిషీ ఎవరు నీవు ?
ఓ మనిషీ!
ఇస్తానని ఆశచూపితే వెంటనే ఇవ్వు
చేస్తానన్న సహాయం తక్షణమే చెయ్
అన్నమాట మీదనే తప్పక నిలబడు
అబద్దాలాడకు వాయిదాలు వెయ్యకు
నటించకు
నమ్మినవారిని నట్టేట ముంచకు
ఈ విచిత్ర మనస్తత్వం ఎవరికీ నచ్చదు
ఓమనీషీ!
వినని వారిని విమర్శించు
గట్టిగా హెచ్చరించు ఎంతగా
హెచ్చరించినా చలించకపోతే
ఏకిపారెయ్ కోరల్ని పీకెయ్
కొమ్ముల్ని విరిచెయ్
బుద్ధికి బూజుపడితే దులపెయ్
అదివంకరగా వుంటే సరిదిద్దేందుకు
సదా సిద్ధంగా వుండు....
ఓ మనిషీ!
మనిషిలోని మంచికోసం
మానవత్వంకోసం
మహత్తరమైన మార్పుకోసం
సంఘంలో సమానత్వం కోసం
నీ కలమెప్పుడూ చేస్తూనే ఉండాలి
యుద్దం...ధర్మయుద్ధం...
ఓ మనిషి!
మానవత్వానికి దైవత్వానికి
మధ్య ఆరు తెరలేవున్నాయి
వినయం - విధేయత ...
విజ్ఞానం - వికాసం ...
విచక్షణ - విలువ...
ఇవిలేనినాడు ప్రతిమనిషి మృతప్రాయుడే
అవి ఉన్నవాడు అందరికి ఆదర్శప్రాయుడే



