Facebook Twitter
అంతా మిథ్య...

ఓ మనిషీ!

ఏదీ నీది కాదని తెలిసినా...

అంతా నాదేనని  

"భ్రమిస్తావు".......

ఆస్తిపాస్తులు, 

భార్యా బిడ్డలు, 

బంధుమిత్రాదులు 

బాంధవ్యాలు

అన్నీ మిధ్యే అని తెలిసినా... 

చివరి శ్వాస వరకు 

"శ్రమిస్తావు"......

కోట్లున్నాయని 

అహంకారంతో

"కోటీశ్వరునని" 

విర్ర వీగుతావు........

నిర్ర నీల్గుతావు కాదంటే

"పిచ్చివాడిలా" 

రెచ్చిపోతావు.........

చిట్టచివరికి ఒక 

"వెర్రివాడిలా" 

వెళ్లి పోతావు..........