Facebook Twitter
ఓ నవదంపతులారా !

ఓ నవదంపతులారా !

వినండి !ఒక  మంచిమాట చెబుతా !

 

అల్లకల్లోలమైన నీటిలో

మురికిపట్టిన పగిలిపోయిన

ముక్కలైన అద్దంలో కాదు

 

నిశ్చలమైన నీటిలోనే

స్వచ్చమైన అద్దంలోనే

మన ప్రతిబింబాలను

మనం స్పష్టంగా చూసుకోగలం

 

మన మనసు ప్రశాంతంగా ఉంటేనే

మన ప్రశ్నలకు, జవాబులు

మన సందేహాలకు, సమాధానాలు

మన చిక్కుసమస్యలకు,

చక్కనిపరిష్కారాలు దొరుకుతాయి

 

గద్దింపులు,గాండ్రింపులు

ఘర్షణలు గొడవలు వద్దేవద్దు

ఒకరినొకరు గౌరవించుకోండి

ఒకరినొకరు ప్రేమించుకోండి...

 

పంతాలు, పట్టింపులు

పగలు, ప్రతీకారాలు వద్దేవద్దు

ఒకరినొకరు అభిమానించుకోండి

ఒకరినొకరు ఆరాధించుకోండి...

 

అప్పుడు మీ కాపురాలు....

పచ్చని కాపురాలు అనురాగగోపురాలు

అ చేప్పుడు మీ జీవితాలు.

ఆనందనిలయాలు అందాల బృందావనాలు