కొంచెం చిల్లర...కోటి వరాలు
ఓ అపరభక్తుల్లారా !
ఓ ఆశాజీవుల్లారా !
మీరొక నిండునిజాన్ని తెలుసుకోండి!
మీరురోజు గుడిమెట్లు ఎక్కుతారు
భక్తితో భగవంతున్ని మొక్కుతారు
గుడి చుట్టూ తిరుగుతారు
గుండు చేయించుకుంటారు
వెంకటేశ్వరుని దర్శించుకుని
ఆశతో ఆర్తితో వేడుకుంటారు
"కొంచెం చిల్లరే" హుండీలోవేసి
"కోటి వరాలు" కోరుకుంటారు
కాని ఏ దేవుళ్ళయినా ఏ దేవతలైనా
మీకు వరాలనివ్వరు శాపాలనివ్వరు
"బంగారు అవకాశాలనిస్తారు,వాటిని
సద్వినియోగం చేసుకునే సమయాన్ని
శక్తిని జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని ఇస్తారు
ఆపై ఆ బంగారు అవకాశాలను మీరు
"వరాలుగా" మార్చుకుంటారా లేక
"శాపాలుగా" మార్చుకుంటారా
అన్నది మీ చేతుల్లోనే వున్నది....
కానీ,ఒక్కటి మాత్రం పచ్చినిజం
అవకాశాలు వరాలైతే అదృష్టదేవత మీవెంటే...
అవకాశాలు శాపాలైతే దరిద్రదేవత మీ ఇంటే...



