నేటిబాలలే రేపటి జాతిరత్నాలు
బాలలు ! ఓ బాలలు !
మీరే రేపటి భావి భారతపౌరులు !
మీరే మా ఇంటికి ఆరనిదీపాలు !
మీరే మా ఆశల ప్రతిరూపాలు !
ఓ బాలలు !
మీరు అల్లరి మానాలి !
ఆడాలి పాడాలి, బడిలో
చక్కగా శ్రద్ధగా చదువుకోవాలి!
గాంధీ నెహ్రూ
సుభాష్ చంద్రబోస్
సర్దార్ వల్లభాయ్ పటేల్
బాబు రాజేంద్ర ప్రసాద్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
భగత్ సింగ్ అబ్డుల్ కలాం
అమితాబ్ సచిన్ వంటి
"జాతిరత్నాలు" కావాలి !
"మట్టిలో మాణిక్యాలై" మెరవాలి !
ఈ భరతజాతికి
గొప్ప "కీర్తిప్రతిష్టలు" తేవాలి !
మీ గుండెలనిండా
జాతీయత "దేశభక్తి" నిండాలి !
మీ చేతిలో ఎప్పుడూ
"జాతీయజెండా"
రెపరెపలాడుతూ వుండాలి !
మీరు పుట్టిన ఊరికి
మిమ్మల్ని కన్న అమ్మానాన్నలకు
మీకు విద్యను నేర్పిన గురువులకు
తల్లి భరతమాతకు
"ఎనలేని కీర్తిని "అందించాలి" !
అవసరమైతే దేశ రక్షణకు
"వీరజవాన్లై" రక్తాన్ని "చిందించాలి"!.
ఔను నేటిబాలలే రేపటి "జాతిరత్నాలు".



