డబ్బు డబ్బు...జబ్బు జబ్బు
డబ్బు డబ్బుగానే ఉంటే
జబ్బు జబ్బుగానే ఉంటుంది
ఆ ధనమే సేవాగుణమైతే
నీవు దాతవే ధన్యజీవే
ఆ ధనమే దానగుణమైతే
నీవు మహాత్మాడివే
మహనీయుడివే
ఆ డబ్బే అల్లుడికి కట్నమైతే
ఆపై ఇళ్ళంతా అంబరాన్నంటే
పెళ్లి సంబరాలే
ఆ డబ్బే ఎలక్షన్లో ప్రచారమైతే
ఆపై తేలేది గెలుపు ఓటమిలే
ఓడితే అదొక గుణపాఠమే
గెలిస్తే దక్కు అధికారపీఠమే
మాయరోగం వచ్చి
మంచానపడితే
ఆ డబ్బే మందుగా మారితే
ఆ డబ్బే డాక్టర్ ఫీజ్తేతే
హాస్పిటల్ లో చెల్లించేబిల్లైతే
ఆపై నీవు ఆరోగ్యవంతుడివే
అదృష్టవంతుడివే
లేదంటే ఆడబ్బే బ్యాంకు ఖాతాల్లో
లాకర్లలో లక్షలై వుంటే
ఆ డబ్బు డబ్బే నీ జబ్బు జబ్బే



