Facebook Twitter
అమాయకపు ‌మేక

ఆకలేసిన ఒక మేక 

కసాయివాడి "ఎడమచేతిలోని" 

పచ్చని ఆకుల్నిచూసి 

పక్కున నవ్వుతుంది

వాడి వెంటే పరుగులు తీస్తుంది

వాడి కాళ్ళచుట్టే తిరుగుతుంది

 

వాడు వీపు నిమరగానే

ఆకులు ముందు విసరగానే 

ఆకలితో వున్న ఆ మేక పాపం

చకచకా ఆకులు మేస్తుందే కాని

వాడి "కుడిచేతిలో" 

పదునైన కత్తివుందని

 

అదే తనకు చివరిరాత్రని

నిద్రలేచీ లేవంగానే...

కళ్లుతెరిచీ తెరవంగానే...

మెడమీద కత్తిపడుతుందని 

రక్తపుమడుగులో పడి

తాను గిలగిలలాడక తప్పదని

ఆపై తన ప్రాణాలు, క్షణాల్లో

గాలిలో కలిసిపోతాయని....

 

ఆ కసాయివాడు పచ్చిమోసగాడని

నేడు తనకు ప్రేమతో తిండి పెట్టేది

రేపు తిరిగి తనను తినడానకేనని...

ఆ "అమాయకపుమేకకు" తెలియదు

పాపం తెలిసీ ప్రయోజనం లేదు