Facebook Twitter
రేపు ఎవరేమౌతారో...ఎవరికెరుక.

ఔరా...ఇది కలయా నిజమా...

ఎంత బుద్దిగా చదువుతోందో ఆ అల్లరి పిల్ల.... 

పుస్తకాల పురుగేమో ఆ పిచ్చిపిల్ల... 

సెల్లు లో గేమ్స్ కు శెలవుపెట్టిందేమో...... 

రెచ్చిపోయి రోజూ సెల్లో 

పిచ్చిపిచ్చి గేమ్స్ ఆడే ఈ పిల్ల...

నేడుతుంటరి పనులు మాని...అలా ఒంటరిగా...  

పుస్తకాలమీద కుదురుగా కూర్చుని... 

ఇంత శ్రద్దగా చదువుతుందంటే ఈ పిల్ల  

ఇల్లుపీకి పందిరేసే అల్లరిపిల్ల కాదు... 

తెలివిగల పిల్ల‌ కావచ్చు...

చదువుల తల్లి కావొచ్చు..

ఇలా నేడు ఇష్టపడి చదివే పిల్లలే

రేపు ఇంజనీర్లు ఔతారు...

ఇలా నేడు కష్టపడి చదివే పిల్లలే 

రేపు కలెక్టర్లు ఔతారు...

నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు... 

నేటి ఈ పుస్తకాల పురుగులే... 

రేపటి ప్రపంచమేధావులు...

నేటి ఈ అపర బాలమేధావులే 

రేపటి బాబాసాహెబ్ అంబేడ్కర్ లు... 

అబ్దుల్ కలామ్ లు...కారల్ మార్క్స్ లు... 

కానీ రేపు ఎవరు ఏమౌతారో...ఎవరికెరుక...?

తలరాతలువ్రాసే తారుమారుచేసే ఆపరమాత్మకుతప్ప...