Facebook Twitter
పిల్లలా కాదు పిడుగులు ..

వీరు పిల్లలా కాదు పిడుగులు 

ఔను నేటి బాలలే 

రేపటి భావి భారతపౌరులు 

 

నిజమే నేటి ఈ‌ పిడుగులే 

రేపు ఔతారు

అమ్మానాన్నలకు గొడుగులు 

అవ్వా తాతలకు అడుగులు 

 

వీరు పిల్లలా కాదు పిడుగులు 

ఔను నిజమే రోజులు మారితే  

రేపు వీరే ఔతారు 

రాజ్యాలనేలే రాజులు మహారాజులు 

 

వీరు పిల్లలా కాదు పిడుగులు 

ఔను నిజమే 

రేపు వీరే ఔతారు గూటిలోగువ్వలు 

ఘల్లుఘల్లుమనే కాలిమువ్వలు 

రేపు వీరే ఔతారు  

ఎగిరే తారాజువ్వలు రగిలేనిప్పురవ్వలు

 

వీరు పిల్లలా కాదు పిడుగులు 

ఐనా వద్దు వీరి మీద కోపతాపాలు 

రేపు వీరే ఔతారు మనఇంటికి ఆరనిదీపాలు 

వీరే నిర్మలత్వానికి స్వచ్ఛతకు ప్రతిరూపాలు 

 

వీరు పిల్లలా కాదు అల్లరిచేసే కోతులు 

ఔను నిజమే నేడు వీరికి భోదిస్తే మంచినీతులు 

రేపు వీరే ఔతారు బంగారు గుడ్లుపెట్టే బాతులు