Facebook Twitter
ముందు ప్రేమ తర్వాత ఆస్తి...

కమ్మనికలలు కంటూ కలుస్తారు

పేగు తెంచుకుని

రక్తాన్ని పంచుకొని పుట్టిన

ముద్దులొలికే 

పిల్లలను చూసి మురిసిపోతారు

 

పేరుపెడతారు పాలుపడతారు 

ప్రేమతో పెంచుతారు కష్టాలెన్నో పడతారు

కడుపు మాడ్చుకుంటారు 

కారు చీకట్లో కన్నీరు కారుస్తారు

రాత్రింబవళ్ళు రక్తాన్ని స్వేదంగా మారుస్తారు

 

అప్పులు చేస్తారు 

అవమానాలపాలౌతారు

పెద్ద చదువులు చదివిస్తారు

కల్తీలేని స్వచ్చమైన ప్రేమను పంచుతారు

గాడిద చాకిరి చేస్తారు

ఘనంగా వివాహాలు జరిపిస్తారు

 

పిల్లల శ్రేయస్సు కోసమే 

ఈ బ్రతుకులంటూ ప్రతిక్షణం తపిస్తారు

ఆఖరికి అన్నీవున్నా సరే అనాధలౌతారు

ఆకలికి అలమటించే అస్థిపంజరాలౌతారు

 

ఓ అమాయకపు తల్లిదండ్రులారా !

మీ పిల్లలఉన్నతికై, వారి బంగారు భవిష్యత్తుకై 

మీరెన్ని త్యాగాలు చేశారో, మీరెంతగా రేయింబవళ్ళు

శ్రమించి పెంచారో ఖచ్చితంగా వారికి తెలియాలి

అందుకే ముందుగా పిల్లలకు మీ "ప్రేమను" పంచండి

ఆ పైనే  మీరు ఆర్జించిన "ఆస్తిస్తులను" పంచండి