Facebook Twitter
ప్రాప్తం"అంటే.......

ఇష్టంలేని గాడిదచేత

బట్టలమూట మోయించడం

 

జుట్టుపట్టుకొని నడివీధిలో

తిట్టుకునే...కొట్టుకునే

భార్యాభర్తలచేత గుట్టుగా 

కాపురం చేయించడం

 

దాహం వెయ్యని గుఱ్ఱముచేత

తొట్టిలో నీళ్లు త్రాగించడం

 

వంద ప్రశ్నలు వేసే మందబుద్ధికి

పాఠాలు బోధించడం పరీక్షలు పెట్టడం

 

ఆ బ్రహ్మతరం కూడా కాదేమో

ఏదేమైనా దేనికైనా ఎవరికైనా 

సరే "ప్రాప్తం" మంటూ వుండాలి

 

"ప్రాప్తం"అంటే

దక్కడం దైవనిర్ణయం దైవప్రసాధితం

 

"ప్రాప్తం" అంటే

విజ్ఞులకు వరం సోమరులకు శాపం

 

"ప్రాప్తం" అంటే ఒక్కరూపాయికే

లక్ష రూపాయల లాటరి తగలడం

 

"ప్రాప్తం" అంటే ప్లాట్లలో లక్షలు పెట్టి

కోట్లుఆర్జించడం కోటీశ్వరులై పోవడం

 

గుర్తు చేసుకుందాం....

గుణపాఠాలు...నేర్చుకుందాం

 

మనసును పరవశింప జేసిన 

మధురక్షణాలను...

రోజూ గుర్తుచేసుకుంటూ...

 

గతకాలపు 

అనుభవాలను

తీపి, చేదు జ్ఞాపకాలను ...

నిత్యం నెమరువేసుకుంటూ...

 

నిన్నటిపొరపాట్లనుండి

తగిలిన ఎదురుదెబ్బలనుండి

తెలిసో తెలియకో చేసిన తప్పులనుండి

గుండెలను పిండేసిన ఘోరదుర్ఘటనలనుండి

గుణపాఠాలను ...

నేర్చుకుంటూ...

 

వృత్తిలో వృద్ధిని అంచెలంచెలుగా 

అభివృద్ధిని.......... అందించే

ఆశలసౌధాలను... నిర్మించే 

కోర్కెల కోటల్ని .... సృష్టించే

లక్ష్యసాధనకు సులభమైన 

సురక్షిత మార్గాలను........సూచించే

ఒక సరికొత్త జీవనానికి... శ్రీకారంచుట్టే

మరో నూతన సంవత్సరానికి...

ఆశతో...

ఆనందంతో...

అభిమానంతో...

ఆత్మీయ ఆహ్వానం పలుకుతూ...

స్వాగతం శుభస్వాగతం చెబుతూ...

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

తెలియజేస్తూ....