Facebook Twitter
ఏమి లాభం...?  ఏమి లాభం...?

ముందుచూపు లేనివారి నెత్తిన

ఎన్ని ముత్యాలు పోసినా 

ఎంత చెత్త వేసినా ఒక్కటేగా

వాటి విలువ వారికి తెలిసి ఛస్తేగా

 

ఆస్తి మీద ఆశలేని నిరాశావాదులకి

ఎన్ని మంచి ఆదాయ మార్గాలు చూపినా 

ఎన్ని చక్కని సలహాలు ఇచ్చినా లాభమేముంది ?

చచ్చినా అవి స్వీకరించరుగా

 

చక్కిలిగింత లేనివారిని 

ఎంతగా గిల్లినా ఎంతగా గిచ్చినా లాభమేంటి ?

వారు చచ్చినా నవ్వరుగా

 

ఆకలి వెయ్యనివారి ముందు

కడుపు నిండి కక్కేవారిముందు

పంచభక్ష్య పరమాన్నాలు పెట్టీ లాభమేంటి?

అవి పచ్చడి మెతుకులతో సమానమే

ఒక్క ముద్దకూడా తిని చాణవరుగా

 

భయమూ భక్తీ వినయమూ విధేయత 

తల్లిదండ్రులంటే ప్రేమ వాత్సల్యం

గురువులంటే  గౌరవం అభిమానం లేని

విద్యార్థికి ఎన్ని పాఠాలు చెప్పినా 

ఎంత శిక్షణ ఇచ్చినా ఏమిలాభం?

బుద్దీజ్ఞానముంటేగా, బుర్రకెక్కిఛస్తేగా

 

బద్దకమూ సోమరితనం తప్ప,చేసేపని మీద

 ఏమాత్రం ఆసక్తి,ఏకాగ్రతలేని ఉద్యోగికి

ఎంత జీతమిచ్చి ఎన్ని ప్రమోషన్లిచ్చి ఏమిలాభం?

సంస్థ అంటే గౌరవముండి ఛస్తేగా