రాక్షస ప్రేమ...
ప్రేతాత్మలు చుట్టు ముట్టి
పెదవుల మద్య ప్రేమ పుట్టి
కళ్ళల్లో కామం పుట్టి
కన్నవాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి
బుర్రకు బూజుపట్టి
బుద్ధికి భూతం పట్టి
చెవులకు సెల్ చెదలు పట్టి
మనసు కి మసి పట్టి
కళ్ళకు గంతలు కట్టి
కాళ్ళకి గజ్జలు కట్టి
మదమెక్కే కదం తొక్కే
వారెట్టివారైనా ఎంతటివారైనా
మట్టి కొట్టుకుపోతారు
ఇసుకలో ఇల్లల్లే కూలి పోతారు
ఎండిన ఆకుల్లా రాలి పోతారు
వారెట్టివారైనా ఊబిలో పడిపోతారు
ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరైపోతారు
వారెట్టివారైనా వారి ముందు జీవితం
ముక్కలు చెక్కలై పోతుంది
వారెట్టివారైనా వారి బ్రతుకు
కుక్కలు చించిన విస్తరి అవుతుంది
ఇది నగ్నసత్యం ఎందుకంటే
అమృతం కురిసే
ఆత్మల ఆలంగనమే "అమర ప్రేమ"
రక్తం త్రాగే ప్రేతాత్మలు
ఆవహించిన ప్రేమే "రాక్షస ప్రేమ"



