జై పాతాళ భైరవి
నరుడా ఏమిరా నీకోరిక
చిన్ని కోరికే తల్లీ
లక్షరూపాయల లాటరి
తగిలేలా దీవిస్తే నీగుడిచుట్టు
వెయ్యి ప్రదక్షిణాలుచేస్తా...
తధాస్తురా నరుడా...
జై పాతాళ భైరవి
నరుడా మళ్ళీఏమిరా నీకోరిక
ఒక కోటి రూపాయలు లాటరి
తగిలేలా దీవించు స్వామి
నీగుడిచుట్టు వెయ్యి ప్రదక్షిణాలుచేస్తా...
గుండు చేయించుకుంటా
తధాస్తురా నరుడా...
ఇది సత్యదేవునితో ఓ భక్తుడి నిత్యనివేదన
ఎన్ని నివేదనలూ చేసినా ఫలితం మాత్రంశూన్యం
నమ్మకం నిగ్రహం కోల్పోయిన భక్తుడు
దేవుని విగ్రహం చెంతకు చేరి నిట్టూర్చాడు
నీవు లేవనంటూ నాపై నీకు దయలేదంటూ
నిరసనను తెలిపాడు దేవునిపై నిందవేశాడు
తిండి తినక కడుపు నిండాలనుకోవడం
టిక్కెట్టు కొనక కోటిలాటరీ కొట్టాలనుకోవడం
అత్యాశ అవివేకం అజ్ఞానమని
ప్రయత్నం చేస్తేనే...ఫలితం దక్కుతుందని
బావిని తవ్వితేనే...దాహం తీరుతుందని
విత్తనం మరణిస్తేనే...మొక్క మొలుస్తుందని
చిరుదివ్వెను వెలిగిస్తేనే...చీకటి తొలుగుతుందని
భగవంతుడిపై అచంచలమైన భక్తి విశ్వాసముంటేనే
చిత్తంలో చింతలు మటుమాయమౌతాయని
సబ్బు కరిగితేనే...బట్టలమురికి పోతుందని
మబ్బు తొలగితేనే...సూర్యుడు దర్శనమిస్తాడని
భక్తునికి ఆ నిత్యదేవుని సత్యసందేశం
అంతే భక్తుడికి బుర్ర వెలిగింది...జ్ఞానోదయమైంది
