ఒంటరిగా కనిపిస్తే
కొంటె చూపులతో
కన్నుగీటి కసిగా కవ్విస్తే
గాలిలో తేలిపోతారు
విహంగాలై విహరిస్తారు
పాపం కన్నెపిల్లలు కొందరు...
చిరునవ్వులు చిందిస్తే
చిలిపి చేష్టలతో అలరిస్తే
చిత్తైపోతారు
హద్దులు దాటి ముద్దులిస్తే
మురిసిపోతారు
మాయమాటలతో మత్తెక్కిస్తే
మైమరిచిపోతారు
పాపం కన్నెపిల్లలు కొందరు...
వేటగాడి వలలో
పావురాల్లు చిక్కుకున్నట్లు
పిచ్చిపట్టి నచ్చిన వాడితో
ప్రేమలో"మునిగిపోతారు"
కామంతో కళ్ళు పొరలుకమ్మి
కౌగిలిలో "కరిగిపోతారు"
నవ్వుతూ పువ్వుల్లా
"నలిగిపోతారు"
పాపం కన్నెపిల్లలు కొందరు...
"రమ్మంటే"వచ్చేస్తారు
సినిమాలకు షికార్లకు
క్లబ్బులకు పబ్బులకు
కసాయివాడి వెంట మేకల్లా
"ఇమ్మంటే"ఇచ్చేస్తారు
కన్యత్వాన్ని కానుకగా
పాపం కన్నెపిల్లలు కొందరు...
పిచ్చిగాతిరుగుతారు
బరితెగించి బజారులో
నచ్చిన వాడితో
కమ్మని కలలు కంటారు
కళ్యాణం జరగాలని
కడుపు పండాలని
పాపం కన్నెపిల్లలు కొందరు...
కలలు నిజమైతే ఇక కళ్యాణ శోభ
కలలు కన్నీటి అలలైతే కన్నోళ్ళకు క్షోభ



