నిన్నటి నిజాలే రేపటి సత్యాలు..?
నిజాలెన్నో కానీ
సత్యమొక్కటే...
నగ్న సత్యమొక్కటే...
నిజాలు నిద్రపోవు...
నిప్పులు గ్రక్కుతాయి...
సత్యాన్ని ఎవరూ
సమాధి చేయలేరు...
నిజం...నీ నీడ
నీవు కళ్ళుమూసే వరకు
అది కనుమరుగు కాదు...
సత్యానికి...ఎవరూ
సంకెళ్ళు వేయలేరు...
నిజం...
నింగిలో
సత్యం...
అంతులేని
అంతరిక్షంలో...
అది అగాధమౌ
నీ అంతరంగంలో...
నిజాన్ని.....నిగ్గు తేల్చు
సత్యాన్ని...అన్వేషించు
నిజానికి నిజం ఆత్మ...సత్యం పరమాత్మ



