Facebook Twitter
ఆ శక్తి ఆకలికే..?

నాడు...
నేరం నాది
కాదు ఆకలిదన్నా...

నేడు...
ప్రగతికై
పరుగులు తీసే...
అభివృద్ధి వైపు
అడుగులు వేసే...
ఆలోచనలను మార్చే శక్తి
ఒక్క"ఆకలికే" ఉందంటారు

నాడు...
అగాధమౌ
జలనిధిలోన
ఆణిముత్యమున్నట్లే...
శోకాల మరుగున దాగి
సుఖముందని ఓ సుకవి అన్నట్లు

నేడు...
మన జీవితాల్ని మార్చేశక్తి
తగిలే ఎదురు దెబ్బలకు...
నెత్తిన పడే పిడుగులకు...
బుసలు కొట్టే సమస్యలకు...
చుట్టు ముట్టే సునామీలకు...
మదిలోని వ్యధలకు బాధలకు...
ఆవేదనలకు...ఆక్రందనలకు...
ఉందంటే నమ్మక తప్పదురా నరుడా...