ఊరకెందుకిస్తావు ఉచిత సలహాలు..
కానీ వినయ సంపన్నులకిస్తే...
శంఖంలో తీర్థం పోసినట్లే...
విని పాటించి వృద్ధిలోకి వస్తారు...
అహంకారులకు...మూర్ఖులకిస్తే...
మూలాన పడేసి
ముసిముసి నవ్వులు నవ్వుతారు...
చెవిలో పువ్వులా పెట్టుకుంటారు....
ఆ ఉచిత సలహాలు...
గుడ్డివాడికి అద్దం చూపించినట్లే...
కుంటివాన్ని గుర్రంలా పరుగెత్తమన్నట్లే...
చెవిటి వాడిముందు శంఖం పూరించినట్లే
అందుకే డబ్బుని
ఎవరి కోసమైనా
ఖర్చు చేయవచ్చు
కానీ సలహాలిచ్చేప్పుడు...
సంపదను దానం చేసేప్పుడు...
మీ విలువైన
సమయాన్ని ఖర్చు చేసేప్పుడు...
ఖచ్చితంగా అర్హతగల వారికే
మాత్రమే అందజేయాలి అందరికీ కాదు...



