Facebook Twitter
యువతా..! ఓ యువతా..!!

యువతా..! యువతా..!
ఓ చిలపి యువతా..!
మీ కోసమే నా ఈ చిరు కవిత..!!

కన్నతల్లి పాలలా
కల్తీ లేనిది నా కవిత..!
కఠినాత్ములను కూడా
కరిగించేది నా కవిత..!

నిజంలా నిజాయితిలా
"నిప్పులాంటిది" నా కవిత..!
కసాయి గూండాలకు సైతం
"కనువిప్పు కలిగించేది" నా కవిత..!

చీకటి జీవితాలకు
"చిరుదీపం" నా కవిత..!
నిరుపేదల కన్నీటి గాథలకు
"నిజరూపం" నా కవిత..!

నవచైతన్యానికి
"నాంది" నా కవిత..!
సమసమాజానికి
ఓ "దివ్యసందేశం" నా కవిత..!

నా ప్రతికవిత
చెప్పేది ఓ యదార్థం..!
ప్రజా సంక్షేమమే నా
ప్రతి కవిత పరమార్ధం..!

సామాజిక హితమే
ఒక అభిమతంగా
స్వేదమే సిరాగా
నేను వ్రాసిన
ఏ ఒక్క కవితయైనా...
ఏ ఒక్క వ్యక్తిలోనైనా...
కాసింత
చైతన్య జ్వాలను రగిలించినా ...
నవజీవన రాగాన్ని రవళించినా...

నా ఆశకు ఆకలి తీరినట్లే...
నా కోరిక కోతై కొండెక్కినట్లే...
నా ప్రతి కవితకు పెళ్ళయినట్లే...
"కష్టేఫలి" అన్న నినాదం నిజమైనట్లే...