కొందరు అమ్మాయిలు....?
తాము అనుకున్నది
సాధించేవరకు నిద్రపోరు
ఎవ్వరికీ భయపడరు
ఎవ్వరినీ లెక్కచెయ్యరు
వెనుతిరగరు వెనుకంజ వెయ్యరు
కలనిజమయ్యేవరకు కన్నుముయ్యరు
చివరిక్షణం వరకు ఒంటరిగానైనా
"ప్రేమపోరాటం" చేస్తారు
ముఖపరిచయంలేని వాడు
మూర్కుడైనా,మోసగాడైనా
దుష్టుడైనా, దుర్మార్గుడైనా
ఎంతటి నీచుడైనా
నికృష్టుడైనా,వాడికోసం
చావు దెబ్బలకైనా
రంపపు కోతలకైనా
రక్తం చిందించడానికైనా
ఆఖరుకు ప్రాణత్యాగానికైనా
ఏ "యుద్దానికైనా" సిద్దమే
అది వారి
అజ్ఞానమో
అవివేకమో
అహంకారమో
మొండితనమో
అమాయకత్వమో
అసలు అర్థమే కాదు
అది అనుకున్నది
సాధించాలన్న పట్టుదల కావచ్చు
లేదా తాము కోరుకున్నది
తమ సొంతమే కావాలన్న ఒక
బలమైన కోరిక కావచ్చు
ప్రేమపిచ్చి కావచ్చు
కళ్ళు పొరలుకమ్మిన కామం కావచ్చు
ఏదైనా కావచ్చు
మరి అది ఎవరికి ఎరుక ? ఆ దేవుడికే ఎరుక



