ఒక్కసారి ఒక్కఅడుగు
ఓ మిత్రమా..!
నా ప్రియ నేస్తమా..!
ఒక్కసారి
ఒక్కఅడుగు...
"వెనక్కేసి" చూడు
గతంలో నేర్చుకున్న
చేదు తీపి అనుభవాల
పాఠాలు గుపాఠాలెన్నో ఎన్నెన్నో...
ఒక్కసారి
ఒక్కఅడుగు...
"ముందుకేసి" చూడు
ఆశల పందిరిలో నిన్న
అల్లుకున్న గిల్లుకున్న ఆ
తీపి తీపి జ్ఞాపకాలెన్నో ఎన్నెన్నో...
ఒక్కసారి
"నీ చుట్టూ"
పరికించి చూడు...
ఆవరించి వుంటాయి
"వాస్తవాలు" ఒక వైఫై లా...
"వదంతులు" ఒక వైరస్ లా...
ఒక్కసారి...
నీలోకి నీవు
తొంగి చూడు...
నీలోనే దాగివున్న...జీఆత్మ
పరమాత్మలు సాక్షాత్కారమౌతాయి...
