కొందరు
కొందరిని...
రైతు మడిలో
కుమ్మరి కుండల
తయారికోసం
మట్టిని తొక్కినట్టు
మట్టిలో వేసి త్రొక్కాలని చూస్తారు
కాని...వారు...
"మొలకెత్తే విత్తనాలని"..వీరికి...తెలియదు
కొందరు
కొందరిపై...
అకారణంగా
నిందలు వేస్తారు
నిప్పులు పెరుగుతారు
ఘాటూగా విమర్శిస్తారు
కసితో విషం చిమ్ముతారు
"ఇటుక రాళ్ళు" విసురుతారు
కానీ వారు...ఆ "రాళ్ళనే మెట్లుగా"
చేసుకొని "ఊహించనంత"...
"ఎత్తుకెదుగుతారని"...వీరికి...తెలియదు
కొందరు
కొందరిని...
నవ్వించి నమ్మించి
గొంతులు కోసేస్తారు
నీటిలో ముంచేస్తారు
సముద్రంలో తోసేస్తారు
కానీ...వారు...
గజ ఈతగాళ్ళని
ఎంత లోతునీళ్ళలో విసిరేసినా
రెండు చేతులలో రెండు చేపలతో
"ఒడ్డుకు చేరుతారని"...వీరికి...తెలియదు
అందుకే ఎవరికీ ద్రోహం చేయకండి..!
"నమ్మక ద్రోహులుగా"...మిగలకండి..!
బద్దశత్రువుల్ని కూడా"ప్రాణమిత్రులుగా"
ప్రేమించండి.."ప్రేమమూర్తులై" జీవించండి.



