పవిత్ర గ్రంథం బైబిల్
పదిఆజ్ఞలను ప్రసాదించి
నిన్నువలె నీ పొరుగువారిని
నీ ప్రాణస్నేహితులనే కాదు
నీ బద్ద శత్రువులను సైతం
ప్రేమించమని ప్రబోధిస్తుంది
నిన్ను శపించేవారిని...
నిన్ను ఆరని నిందల
నిప్పుల్లో త్రోసేవారిని...
నిన్ను ద్వేషించే వారిని...
నిన్ను హింసించే వారిని...
నీ కన్నీళ్ళను త్రాగే వారిని...
నిన్ను రంపంతో కోసే వారిని...
నిన్ను అగాధంలో నెట్టే వారిని...
నీ అభివృద్ధికి అడ్డుపడే వారిని...
నిన్ను కత్తులతో పొడిచే వారిని...
ద్వేషించక ప్రేమించాలంటే...నీవొక
కారుణ్యమూర్తియైన యేసుక్రీస్తుగానో...
అభినవ బుధ్ధునిగానో...అవతరించాలి...
నీలో ప్రేమతత్వం మానవత్వం జనించాలి
నిజానికి నేడు
నీ మంచితనం ఒక అగ్నిపరీక్షకు
గురికావొచ్చు...విలువ లేకపోవచ్చు
కానీ రేపటి రోజు ఆ మంచితనమే
నీకొక "రక్షణ కవచ"...మౌతుంది
నీ ఆత్మస్థైర్యం...
ఒక "ఔషధ"...మౌతుంది
నీ ఆత్మగౌరవం...
ఒక "ఆయుధ"...మౌవుతుంది
నీ ఆత్మవిశ్వాసం..
ఒక "ఆశాదీప"...మౌవుతుంది
ఆవగింజంత ఆత్మబలంతో...
అలసి సొలసి పోయిన నీ జీవితం...
ఒక "ఆనందసాగర"...మౌవుతుంది అది
ఆశాజీవులకైనా...నిరాశావాదులకైనా..!



