ఓ మిత్రమా..! నీవు
ఎంత మంచి చేసినా
ఎదుటి వాళ్ళు
విమర్శల బాణాలు
విసురుతూనే ఉంటారు
ఏవో సూటిపోటి
మాటలంటూనే ఉంటారు
ఎగతాళి చేస్తూనే ఉంటారు
వాళ్ళను
పట్టించుకుంటే...?
కూర్చుని ప్రతిరోజు
కుమిలి పోతుంటే..?
నీకు "ఓటమి ఖాయం"
చేయాలనుకున్నవేవో
చేశేసెయ్...ఏదో ఒకరోజు
"గెలుపుగుర్రం" ఎక్కేస్తావ్"
"గజరాజులు"
వీధిలో విహరిస్తుంటే
"పిచ్చి కుక్కలెన్నో"
మొరుగుతుంటాయి...
ఆ గజరాజులేవీ మొరిగే
ఆ కుక్కల్ని లెక్కచెయ్యవ్...
అందుకే...
చీకట్లో కూర్చొని చింతించకు
"చింత నిన్ను చిత్రవధ" చేస్తుంది
"ఒక చిరుదీపం" వెలిగించెయ్...
"చిమ్మ చీకటిని" తొలిగించెయ్...
వెలుగు....ఒక ఊపిరి...
చీకటి......ఒక సమాధి...
చీకటి "చింతకు" ప్రతిరూపం
ప్రకృతి "సృష్టికి" ప్రతిరూపం
అఖండమైన "ఆత్మ విశ్వాసం"...
అనంతమైన"ఆత్మశక్తికి" ప్రతిరూపం
సాహసంతో కూడిన ఉన్నతమైన
మహోన్నతమైన...ఉత్కృష్టమైన
అద్భుతమైన.....ఆశ్చర్యకరమైన
మహా అద్భుతమైన....కార్యాలకు
పునాదిరాళ్ళు...పది...?
ఆత్మ విశ్వాసం...
కసి...కృషి...పట్టుదల...
ఆత్మ బలం...ఆత్మ స్థైర్యం...
సత్సంకల్పం...సాహస కృత్యం...
కఠోరమైన సాధన...దృడమైన దీక్ష.
