Facebook Twitter
మట్టిలోని మాణిక్యాలు..!!

చూడండి..! చూడండి..!
అలా అమాయకంగా
కూర్చున్న వ్యక్తిలో
ఎంతటి టాలెంట్ దాగి ఉందో..!

వీరు కదా రాళ్ళలో మెరిసే రత్నాలు..!
మట్టిలో దాగిన మాణిక్యాలు..!

చేయూత నిద్దాం..! వారి ప్రతిభకి...
సెల్యూట్ చేద్దాం..! వారి క్రియేటివిటీకి...

ఆశిద్దాం..! ఆశీర్వదిద్దాం..!
మున్ముందు వారి హస్తాలు మరిన్ని
అధ్భుతమైన...అపురూపమైన...
అద్వితీయమైన చిత్రాల్ని సృష్టించాలని..!

వారిలోని కళానైపుణ్యం ఖండాంతరాలు దాటాలని..!
వారికి కీర్తి కిరీటాలు...
పరమేశ్వరుని కరుణా కటాక్షావీక్షణాలు...
కళాకారులుగా గొప్ప గుర్తింపు దక్కాలని..!

ప్రముఖులచే ప్రశంసలు...
అవార్డులు....రివార్డులు...
సన్మానాలు...సత్కారాలు వారు
అందుకోవాలని మనసారా కోరుకుందాం.!