Facebook Twitter
నిన్న నేడు ...

నేడు
నిన్ను
ఓటమి
ఓడించవచ్చు...
కానీ...

రేపు
నీ ఓపిక
నీ ఓటమిని
ఒక ఆట ఆడిస్తుంది...
ఖచ్చితంగా ఓడిస్తుంది...

నేడు
నిరాశ
నిస్పృహలు
నిట్టూర్పులు
నిన్ను నిప్పురవ్వల్లా
చుట్టు ముట్టవచ్చు...
కానీ...

రేపు
నీలో చిగురించే
చిరుఆశ అన్నింటినీ
దహించి వేయవచ్చు...

నేడు
నిన్ను
చింతలు
చీకాకులు
చిమ్మ చీకట్లు
కమ్ముకోవచ్చు...
కానీ...

రేపు
నీ పెదవులపై
వెలిగించే
చిరునవ్వు
నీ చుట్టూ వెన్నెల
వెలుగుల్ని విరజిమ్మవచ్చు...