Facebook Twitter
కాకివో...కోకిలవో...

మిత్రమా..!
ప్రియ నేస్తమా..!!

నీకంటూ
ఒక నిర్దిష్టమైన...
ఒక స్పష్టమైన...
ఒక ఉన్నతమైన...
లక్ష్యమంటూ లేకపోతే..!

ఎవరో ఒకరు నిన్ను
తమ లక్ష్యసాధన కోసం
పావుగా వాడుకుంటారు
మెట్టుగా వాడుకుంటారు..!

అందుకే ఇతరులు
ఎవరెస్టు శిఖరం
ఎక్కడానికి...
వాళ్ళ కాళ్ళ కింద
మెట్టుగా ఉంటావో లేక
నీవే ఎవరెస్టు శిఖరాన్ని
అధిరోహిస్తావో...
ముందు నిర్ణయించుకో...!

కింగ్ వో...కింగ్ మేకర్ వో...
రాజువో...రాజుకు బంటువో...
బోధించే గురువువో...
గురువుకు వినయ
విధేయతలతో శుశ్రూష చేసే
ప్రియ శిష్యుడివో...
కర్ణకఠోరంగా అరిచే కాకివో...
కొమ్మల్లో కూర్చొని కమ్మగా పాడే
కోకిలమ్మవో...ముందు తేల్చుకో..!