Facebook Twitter
ఏది నిజమైన ప్రేమ....

కామం 

నిండిన కళ్ళనుండి 

పుట్టే ప్రేమ 

ఖచ్చితంగా కల్తీ ప్రేమయే

 

అమ్మాయిలూ జాగ్రత్త

కలలు కల్లలౌతాయ్ 

కన్నీళ్లే మిగుల్తాయ్

పిచ్చి ప్రేమ పేరున 

పచ్చి మోసగాళ్ళు

విసిరిన వలల్లో చిక్కుకుంటే  

విలవిల లాడిపోతారు 

గట్టునపడిన చేపల్లా 

గిలగిలా కొట్టుకుంటారు

 

అమ్మాయిలూ 

ఆగండి కాస్త ఆలోచించండి

కాని అడుగు ముందుకు వెయ్యకండి

 

అర్థం చేసుకొనే అంతరంగం నుండి

పుట్టే ప్రేమ అమ్మ పాలలా

అమృతంలా స్వచ్చమైన ప్రేమ 

 

అమ్మాయిలూ ఆలోచించండి 

కాని ఆగక ఆలస్యం చేయక

అడుగు ముందుకు వెయ్యండి

 

కోరుకున్నవాడు కోటీశ్వరుడు కాకపోయినా

నమ్మిన వాడు నయవంచకుడు కాకపోతే చాలు

పచ్చని కాపురాన్ని ప్రసాదించేది ఆ పరమాత్ముడే

ఇక భయపడకండి బాణంల్లాగ దూసుకొనిపొండి