సైలెంట్ సంకేతం"...?
ఒక సత్సంకల్పంతో
ఒక బృహత్తర కార్యక్రమం
తలపెట్టిన శుభవేళ ...
అనుకోకుండా అకస్మాత్తుగా
"ఎన్ని ఎదురు దెబ్బలు" తగిలినా
"ఎన్ని అవాంతరాలు...
"అడ్డంకులు"ఎదురైనా
అవి శాపాలుగా కాక...
వరాలుగా...సంకేతాలుగా గుర్తించాలి...
ముందస్తు హెచ్చరికలుగా భావించాలి...
చీకటి పడిందని...చింతించవద్దని...
రేపు ఉషోదయమంటూ ఒకటున్నదని...
క్రింద పడినందుకు బాధ పడరాదని...
పడిన చోటనే పడుకో రాదని...
చతికకిల పడిపోరాదని...
తిరిగి బంతిలా పైకి లేవాలని...
"అదొక సైలెంట్ సంకేతం"...
దిశను మార్చుకోమని...
మరోమార్గంలో పయనించమని...
"అదొక ముందస్తు హెచ్చరిక"...
రెట్టింపు ఉత్సాహంతో
ఆశతో ఆత్మ స్థైర్యంతో
ముందుకు సాగిపోవాలని...
"అదొక అదృశ్య సందేశం"..



