కోపంతో ఉన్న
కాకుల గుంపులో
చిక్కుకుంటే....ఓ హంస..!
ఆకలితో ఉన్న
హంసల గుంపులో
చిక్కుకుంటే......ఓ కాకి..!
ఆ హంస దీనస్థితి...వర్ణనాతీతం..!
దర్శించగలమా..! ఆ దారుణం..!
ఈ కాకి దుస్థితి..? మహా ఘోరం..!
ఊహించగలమా..! ఆ ఉత్పాతం..!
కోపంతో ఉన్న
మహిళల గుంపులో
చిక్కుకుంటే...ఓ మగాడు..!
ఆకలితో ఉన్న
మగాళ్ళ గుంపులో
చిక్కుకుంటే....ఓ మగువ..!
ఆ మగాడి దీనస్థితి...వర్ణనాతీతం..!
దర్శించగలమా..! ఆ దారుణం..!
ఈ మగువ దుస్థితి..? మహా ఘోరం.!
ఊహించగలమా..! ఆ ఉత్పాతం....!
ఆకలితో ఉన్న
పాముల గుంపులో
చిక్కుకుంటే...ఓ కప్ప..!
కోపంతో ఉన్న
చీమల గుంపులో
చిక్కుకుంటే...ఓ పాము..!
ఆ కప్ప దీనస్థితి...వర్ణనాతీతం..!
దర్శించగలమా..! ఆ దారుణం..!
ఈ పాము దుస్థితి..? మహా ఘోరం.!
ఊహించగలమా..! ఆ ఉత్పాతం....!
కోపంతో ఉన్న
పులుల గుంపులో
చిక్కుకుంటే...ఓ జింక..!
ఆకలితో ఉన్న
తోడేళ్ళ గుంపులో
చిక్కుకుంటే...ఓ మేక..!
ఆ జింక దీనస్థితి...వర్ణనాతీతం..!
దర్శించగలమా..! ఆ దారుణం..!
ఈ మేక దుస్థితి..? మహా ఘోరం.!
ఊహించగలమా..! ఆ ఉత్పాతం....!
కోపంతో ఉన్న
కోతుల గుంపులో
చిక్కుకుంటే...ఓ చిన్నారి..!
ఆకలితో ఉన్న
కుక్కల గుంపులో
చిక్కుకుంటే...ఓ పసి బాలుడు..!
ఆ చిన్నారి దీనస్థితి...వర్ణనాతీతం..!
దర్శించగలమా..! ఆ దారుణం..!
ఈ బాలుని దుస్థితి..? మహా ఘోరం..!
ఊహించగలమా..! ఆ ఉత్పాతం....!



