Facebook Twitter
పోలన్న కవి సూక్తిసుధ..!

మంచినీళ్ళబావి
మౌనంగా ఉండురా..!
ఉప్పునిటి సముద్రమే ఉరుముచుండురా ..!
అలలు రేపుతూ
అరచుచుండురా..!

మహాజ్ఞాని మునిలా
మౌనంగా ఉండురా..!
పచ్చని చెట్టులా
ఎదుగుచుండురా ...
మూర్ఖుడే శునకంలా
మొరుగుచుండురా..!
తిక్కరేగి ఊరంతా
తిరుగుచుండురా..!

అన్నమున్న అరిటాకు
అణిగిమణగి ఉండురా..!
ఏమిలేని ఎంగిలిస్తరాకే
ఎగిరెగిరి పడుచుండురా..!

కంచుమ్రోగినట్టు
కనకమ్ము మ్రోగదు సోదరా..!

అన్న పోలన్న సుభాషితం..!
విన్న మీ జీవితం సువర్ణశోభితం..!!