Facebook Twitter
ఆ రెండు..?

ప్రశాంతత
కోరుకునేవారు
గుళ్ళు గోపురాలు
పుణ్య క్షేత్రాలు దర్శిస్తారు

వినోదం ఆనందం
సంతోషం కోరుకునేవారు
విహార యాత్రలు చేస్తారు
అన్ని చోట్లకు వెళ్ళాలని ఆ
సుందర దృశ్యాలను తిలకించి
పులకించి పోవాలనుకుంటారు

వీలైతే మళ్ళీ మళ్ళీ
వెళ్ళాలనుకుంటారు
అక్కడ చూసినవి
తిరిగిన ప్రదేశాలు
మనసులో
తీపి జ్ఞాపకాలే...
ఇంట్లో గోడకు
వేలాడే ఫోటోలే...

దర్శించేందుకు
ఎవరూ ఇష్టపడని
రెండు ప్రదేశాలు
హాస్పిటల్ శ్మశానం
ఒకటి తాను
తన శ్రేయోభిలాషులు
అనారోగ్యం పాలైతే...
అవసరమైతే తప్ప...
మరొకటి ఎవరైనా
ఆత్మీయులు చనిపోతే...‌
విధిలేని పరిస్థితుల్లో తప్ప...

ఆరోగ్యంగా
ఉన్నవారెవరూ
ఆస్పత్రులు దర్శించరు
ఉద్యోగులు రోగులు తప్ప...
స్మశానాన్ని
ఎవ్వరూ దర్శించరు ...
చేతబడి చేసేవారు...
శవాలు మోసేవారు...
కాల్చే కాటికాపరులు తప్ప...