మయసభ..?
చూడ చూడ...
దూరపు కొండలు నునుపే...
దగ్గరకెళ్ళి చూడ అంతా
రాళ్ళూరప్పలే చెట్లుచేమలే...
పాములపుట్టలే రాళ్ళగుట్టలే...
చూడ చూడ...
ఉప్పు చక్కెర పోలిక ఒక్కటే...
తిని చూడ రుచులు వేరు వేరే...
చూడ చూడ...
కాకి కోకిల రంగు ఒక్కటే...
కానీ కూతలు విని చూడ
వాటి స్వరాలు వేరు వేరే...
చూడ చూడ...
కుక్క నక్క పోలిక ఒక్కటే...
కానీ గట్టిగా గమనించిచూడ
వాటి విశ్వాసాలు వేరు వేరే...
సృష్టి అంతా చిత్రమే విచిత్రమే...
అంతుచిక్కని ఒక చిదంబర రహస్యమే...



