ఓ నా ప్రియమిత్రులారా..!
చిన్నదే కదాని దేన్నీ
చూలకనగా చూడకండి..!
ఒక అగ్గిపుల్ల కారడివిని కాల్చి
బుగ్గిచేస్తుందని గుర్తుంచుకోండి..!
మొక్కేకదాని పీకెయ్యకండి..!
తోటమాలొకడు మీ పీక
నొక్కేస్తాడని గుర్తుంచుకోండి..!
గేటు సైతం తాకలేరని
ఎవరినీ ఎగతాళి చేయకండి..!
ఏకంగా ఒక సునామీలా
ఒక రామబాణంలా
అసెంబ్లీలోకి దూసుకొస్తారని
డిప్యూటీ సిఎం సీటునే కౌవశం
చేసుకుంటారని గుర్తుంచుకోండి..!
అధికారముందని
ప్రతిపక్ష హోదా సైతం
మీకు దక్కనివ్వమని
ఎవరినీ బెదిరించకండి..!
అదికూడా దక్కని చెడు
రోజొటి మన కోసం కాచుకు
కూర్చుందని గుర్తుంచుకోండి..!
ఈ సీటు ఈ చోటు
ఈ కోట ఈ సెక్యూరిటీ కలకాలం
మానదేనంటూ కలలు కనకండి..!
వాటి మీద ఆ దైవం
మరొకరి పేరును వ్రాసిపెట్టి
వున్నాడేమో గుర్తుంచుకోండి..!
ఓ నా ప్రియమిత్రులారా..!
పిచ్చివాడికి సైతం ఒక మంచిరోజు
వస్తుందన్నది ఒక పచ్చినిజమని...అది
ఆ పరమాత్మ వరమని మరువకండి..!



