నీ హృదయం...
నవనీతమైతే...
నీ మనసు...
మంచు ముక్కైతే...
నీ మాట...
తేనెచుక్కైతే...
నీ చిరునవ్వు..
పూలమొక్కైతే...
నీలోని
నీతినిజాయితీ
నింగిలో చుక్కైతే...
నీ వ్యక్తిత్వం...
వెలిగే దీపమైతే...
ఓ నా ప్రియమిత్రమా..!
నీవా పరమేశ్వరునికి ప్రతిరూపమే...
ధరణిలో నడిచే దైవమే...సందేహంలేదు
వాడి కడుపులో
కత్తులున్నాయి...జాగ్రత్త..!
మిత్రమా ఒక చిన్న మాట...
వాడు నీకు విలువనివ్వడు
ఒక చోట ప్రశాంతముగా
నిన్ను నిలువనివ్వడు...
వాడా నీ ప్రాణమిత్రుడు కాదు కాదు
వాడు మిత్రుని రూపంలో ఉన్న
ఒక బద్ద శత్రువు...జరా జాగ్రత్త
మిత్రమా ఒక చిన్న మాట...
వాడు నిన్ను చూసి
ఈర్ష్య పడుతుంటాడు
నీగురించి ఇతరులకు
చెడుగా చెబుతుంటాడు
వాడా నీ ప్రాణమిత్రుడు కాదు కాదు
వాడు స్నేహితుని రూపంలో
ఉన్న ఒక శత్రువు...జరా జాగ్రత్త
మిత్రమా ఒక చిన్న మాట...
వాడు నీపై నిందలు వేస్తాడు
నిప్పులు చేరుగుతాడు ...నీ వెనుక
నిన్ను రోజూ విమర్శిస్తూ ఉంటాడు...
నీపై విషం చిమ్ముతుంటాడు
వాడా నీ ప్రాణమిత్రుడు కాదు కాదు
వాడు కడుపులో కత్తులుంచుకొని కౌగిలించుకునే దుష్టుడు
దుర్యోధనుడు దృతరాష్ట్రుడు...
వాడు నీకు ప్రక్కలో బల్లం...జరాజాగ్రత్త.
వాడిపై నిఘాపెట్టి ఉండు
వాడు నిన్ను చూసి నవ్వుతాడు
వెనుక లోతుగా గోతులు త్రవ్వుతాడు
వాడు నీ అనుకూల శత్రువు...
వాడి నీచ బుద్ధికి నిప్పు పెట్టు...
వాడి నీచ బుద్ధిని శుద్ది చెయ్...
వాడికి కర్రుతో కాల్చి వాతపెట్టు...
వాడు ఈ సమాజానికి
పట్టిన ఒక చీడపురుగు...
వాన్ని వదిలించుకో... నీకు
వాడివల్ల ఏ ప్రయోజనం లేదు
పెను ప్రమాదం తప్ప...
మిత్రుమా నీకిది నా సలహా కాదు
నా హెచ్చరిక నీ శ్రేయోభిలాషిగా...



