ఔను ఈ భూగోళంలో
ఈ మనిషి జీవితం ఒక వింత
అది ఖగోళంలో సైతం
అంతుచిక్కని ఒక పాలపుంత
ఈ మనిషి జీవితంలో
ఒక చెడు రోజు ఉంది..!
ఒక మంచి రోజు ఉంది..!
ఒక రోజు అఖండ విజయం..!
ఒక రోజు ఘోర పరాజయం..!
ఒక రోజు నెత్తిన పిడుగులు..!
ఒక రోజు తలపై పూలవర్షం..!
ఒక రోజు ఇంట
చిరునవ్వుల చినుకులు..!
ఒక రోజు కంట
ఆగని కన్నీటి ధారలు..!
ఎందుకీ సంతాపాలు..?
ఎందుకీ సంతోషాలు సంబరాలు..?
ఒకరోజు ఎవరెస్టు శిఖరం పైకి
ఒక రోజు అథఃపాతాళానికి...
ఒక రోజు నేలో ధూళిలో పడిపోతాం..!
ఒకరోజు లేచి లేడిలా పరుగులు తీస్తాం..! ఎక్కడివీ అనుభవాలు..?
ఎక్కడివీ పాఠాలు గుణపాఠాలు..?
నేడు ఒక బలహీనుడు
రేపు ఒక బాహుబలి..!
నేడు ఒక బికారి భిక్షగాడు
రేపు ఒక బిల్ గేట్స్..!
నేడు ఒక పరాజితుడు
రేపు ఒక విశ్వ విజేత..!
ఒకనాడు అసెంబ్లీ గేటు
సైతం తాకలేవంటూ
అవహేళనకు గురైన నేత
నేడు అసెంబ్లీలో ఏకంగా
డిప్యూటి సియం
సీటునే ఆక్రమించడం
21 సీట్లకు పోటీ చేసి
21 సీట్లలో విజయఢంకా మ్రోగించడం
ఎక్కడివీ వరాలు..?
ఎక్కడివీ ఆ శాపాలు శని రోజులు ..?
ఒక రోజు ఊహించని
ఊపిరాడని విషాదపు ఊబిలో...
ఒక రోజు విలాసవంతమైన
వినోదభరిత విహార యాత్రలో...
ఎక్కడివీ అదృష్ట దురదృష్టాలు...
ఎక్కడివీ పాఠాలు గుణపాఠాలు..
ఆలోచిస్తే...
ఆ పంచభూతాలే
ఆ ప్రకృతిలోని
ఆ అదృశ్యశక్తులే
మనకు
పాఠాలు చేప్పే...
గుణపాఠాలు నేర్పే...
గురుదేవుళ్ళు కోబోలు...
ఆలోచిస్తే...
ఆ చీకటి వెలుగులే...
ఆ సూర్యాస్తమయాలే
సకల జీవుల
సుఖ జీవనానికి
సూత్రధారులు...
నరులు నడకలకు
మార్గ దర్శకులు...
మనకు శక్తిస్వరూపులు
స్పూర్తి ప్రదాతలు కావొచ్చు



