ఓ అమ్మాయిల్లారా !
నిన్న మీ అక్కలు
నిర్భయ, దిశ, ఆయేషా
నేడు హత్రాస్ లో
మీ దళితచెల్లి
మానవమృగాలైన
కళ్ళుపొరలు కమ్మిన
కామాంధుల కబంధ
హస్తాలలోనలిగిపోయారని
అత్యాచారానికి గురయ్యారని
చిత్రహింసలనుభవించారని
పెట్రోల్ పోసి తగలపేడుతుంటే
హాహాకారాలు చేస్తూ కళ్ళముందే
కాలి బూడాదైపోయారని,
అందంగా ఆడపిల్లలుగా పుట్టడమే
మేము చేసిన "తప్పని"
అడుగడునా "ముప్పని"
ఆడపిల్లలకన్న ఆకాశంలో
పక్షులే స్వేచ్ఛగా జీవిస్తున్నాయని
కలతచెందకండి ! భయపడకండి !
సమతావాదులంతా
మానవతావాదులంతా
అందబేత్కరీయులంతా
అభ్యుదయవాదులంతా
మీ వెంటే వున్నారు
మీరు ధైర్యంగా వుండాలి
జాగ్రత్తగా వుండాలి,ఐతే
న్యాయం జరిగేంతవరకూ
ఓపిక వున్నంతవరకూ, కాదు
ఊపిరి ఉన్నంత వరకు పోరాడాలి
"కత్తులు" సిద్దం చేసుకోండి
కళ్ళుపొరలు కమ్మినకామాంధుల
కుత్తుకలు త్రెంచడానికి
"ఉరితాళ్శు" సిద్దం చేసుకోండి
మీరు ఉరివేసుకోవడానికి కాదు
ఉన్మాదులను ఉరితియ్యడానికి
"ఆడపిల్లలం కాదు, మేము అగ్గి పుల్లలమని"
"మా నాలుకలు కోఏస్తే మీపీకలు కోసేస్తామని"
ముక్తకంఠంతో దిక్కులు పిక్కటిల్లేలా నినదించండి.



