Facebook Twitter
చిరునవ్వులు చిందించు..!చిరుదీపం వెలిగించు...!

ఓ మిత్రమా..! 

నా ప్రియ నేస్తమా..! 

వినుమా..! ఇదిగో 

నీ కోసం నా చిరుసందేశం..!

ఓ మిత్రమా..! నేడు 

నీవు వెలిగించే చిరుదీపం 

రేపు నీకు కొండంత వెలుగు నివ్వకపోవచ్చు కానీ...

నీ చుట్టూ కమ్ముకున్న

చిమ్మ చీకటిని చీల్చగలదు 

నీకు దారిచూపగలదు...

నిన్ను గమ్యం చేర్చలేదు...

ఓ మిత్రమా..! నేడు 

నీవు నవ్వే చిన్న చిరునవ్వు...

నీ ముఖంలో వేయి వెన్నెలలను 

నింపక పోవచ్చు కానీ... 

నీ ముఖానికి గోరంత కాంతిని... 

నీ మనసుకు కొండంత శాంతిని...

నీవు ఊహించనంత ప్రశాంతతను..

రేపు నీకు ప్రసాదించగలదు... 

ఓ మిత్రమా..! నేడు 

నీలో చిగురించిన 

చిరు సాహసంతో 

నీవు కొండలను 

పిండి చేయలేకపోవచ్చు 

కానీ...అది నీలోని పిరికితనాన్ని 

పాతాళానికి విసిరి వేయవచ్చు 

నిన్ను ధైర్యంతో ముందుకు సాగేలా విజయ శిఖరాలను చేసుకునేలా... 

నీలో నిప్పులు చెరిగే 

నీవె నివ్వెర పోయేలా... 

అనంత స్పూర్తిని... 

సూర్యకిరణాలంత శక్తిని...

రేపు నీలో నింపగలదు 

ఇది సత్యం ఇది నగ్నసత్యం...

అందుకే ఓ మిత్రమా. ఉంది.!

ఒక చిరుదీపం... 

ఒక చిరునవ్వు...  

ఒక చిరుసాహసం...ఐతే నీ సొంతం... 

ఇక విజయలక్ష్మి నీ వెంటే జీవితాంతం...