Facebook Twitter
నీదికాదు రేపన్న నిజంతెలుసుకో..!

నిన్ను నీవు 

గట్టిగా నమ్ము... 

బలంగా విశ్వసించు...

ఎవరినైనా 

అర్ధించే ముందు...

ఆశతో అడిగే ముందు... 

కన్నీటితో ప్రార్ధించే ముందు...

చెవియొగ్గి 

శ్రద్ధగా ఆలకించు... 

పెదవి విప్పి మాట్లాడే ముందు...

కష్టపడి... 

కండలు కరిగించి... 

అహర్నిశలు శ్రమించి...ఆర్జించు...

అనవసరంగా ఖర్చుచేసే ముందు... 

ఒక్కక్షణం ఆలోచించు... 

ఇతరులకు చెప్పే ముందు... 

నీతులు చెప్పకు...నిజాలు తప్ప

ఒక్కసారి  

చిట్టచివరిగా 

గట్టిగా ప్రయత్నించు... 

గొప్ప ఆశయంతో ఎంతో 

ఆశతో బాధ్యతతో తలపెట్టిన 

ఒక శుభకార్యాన్ని విరమించే ముందు...

 

ఏ క్షణంలో 

ఏ రూపంలో

ఎటువైపు నుండి 

మృత్యువు విరుచుకు

పడుతుందో ఎవరికెరుక..?

 

నేడే చివరిరోజుగా భావించు

ఈ రోజును పూర్తిగా సంపూర్ణంగా 

సంతృప్తిగా ఆనందంగా అనుభవించు..‌.

ప్రపంచాన్ని ప్రేమ పరిమళాలతో నింపు... మనసారా పరమాత్మను భక్తితో స్మరించు 

నేడే నీదని... 

రేపు నీదికాదన్న నిజం తెలుసుకో...

ఈ క్షణమే నీదని..‌. 

మరుక్షణం మరణానిదని...మరచిపోకు...