Facebook Twitter
ఆశే మనిషికి ఆయుధం

మనకళ్ళకు కనిపించని 

కరోనా కొట్టిన కొరడా 

దెబ్బలకు ఒంటినిండా వాతలే 

విచిత్రమైన విధి వ్రాతలే

విశ్వమంతా విషాదగీతాలే

గుండెనిండా మానని గాయాలే

క్షణక్షణం భయం భావోద్వేగాలే

ముందు జీవితాలు అంధకారమే

అయోమయమే అగమ్యగోచరమే 

 

మనసునిండ మింగలేని కక్కలేని

మానసిక వ్యధలే బాధలే వేదనలే

చింతలు చీకాకులే చిమ్మచీకటులే

తలనిండా చిక్కుముడులు పడిన

గజిబిజి ఆలోచనలే గందరగోళాలే

కదిలిస్తే కలవరింతలే పలవరింతలే

గుండెలు రగిలే పగిలే చేదుజ్ఞాపకాలే 

విషాదభరితమైన వేడి నిట్టూర్పులే

కాంతిలేని కళ్ళనిండా కన్నీటిగాథలే 

కరోనా మరణాలే మారణహోమాలే

కాని,

ఆశే మనిషికి శ్వాస, 

ఆశే మనిషికి ఊపిరి

ఆశే మనిషికి ఆక్సిజన్, 

ఆశే మనిషికి ఆయుధం