Facebook Twitter
అసూయ… ఒక మందులేని రోగం..!

ఆ రోగులు 

ఒకరు పచ్చగా ఉంటే... 

ఓర్చుకోలేరు... 

ఎప్పుడూ

కళ్ళల్లో నిప్పులు 

పోసుకుంటూ ఉంటారు

కడుపు మంటతో ఉంటారు 

ఎదుటి వారి...

ఎదుగుదలను

అభివృద్ధిని...సహించలేరు... 

ఒకరు నవ్వుతూ 

ఆనందంగా ఉంటే...భరించలేరు

ప్రతినిత్యం అసూయతో...

రగిలిపోతూ ఉంటారు... 

తాము తీసుకున్న గోతిలో 

తామే పడిపోతూ ఉంటారు...

తాము కూర్చున్న కొమ్మను 

తామే నరుక్కుంటారు... 

తమ నాశనానికి తామే 

తలుపులు తెరుచుకుంటారు...

అనసూయ 

ఓ ఆరని అగ్నికణం... 

అది అంతరంగాన 

రగులుతున్నంతకాలం 

అంధకారమే...జీవితం ప్రతిక్షణం... 

మిత్రులారా ఒక్క మాట 

మీలోని మానవత్వపు 

మేఘాలను కరిగించండి... 

మీ శత్రువుల హృదయాలలో

ప్రేమ జల్లులు కురిపించిండి... 

అసూయ అతి ప్రమాదకరమండి...

అసూయ భూతాన్ని నేడే జయించండి...

హాయిగా తృప్తిగా ఆనందంగా జీవించండి.