ఊ అంటారా..? ఊహూ అంటారా...?
నీవు ఎవరిపైనా
నిప్పు కణికలు విసరలేవు
నీ చేతులు కందకుండా...
కానీ నీపై నాలుగు
చుక్కలు చిందకుండా
వివాహానికొచ్చిన
అతిధులపై నీవు సుగంధ
పరిమళాలను వెదజల్లలేవు...
అది సత్యం ఒక నగ్నసత్యం...
కాళ్ళు తడవకుండా
ఎవరూ సముద్రాన్ని ఈదలేరు
కలహాలు లేకుండా కాపురాన్ని...
సమస్యలు లేకుండా సంసారాన్ని...
ఎవరూ కొనసాగించలేరు
ఇదీ నిజం...
ఎవరూ కాదనలేని పచ్చినిజం...
ఏమంటారు మిత్రమా..?
ఊ అంటారా..? ఊహూ అంటారా...?



