Facebook Twitter
హంస అవతారం

నాడు రాక్షస రావణుడు
ఋషిరూపం ధరించే...
అమాయకపు సీతను
అహంతో అపహరించే...

నేడు "చెడు" సైతం ఒక
"మంచి" రూపాన్ని ధరించి
మంచి మనిషిని
మానవమృగంగా...
పావనమూర్తిని
పరమ దుర్మార్గునిగా...
పరమ పవిత్రున్ని
అపవిత్రునిగా...మార్చేస్తుంది

నేడు చేసిన
ఒక "చెడుపని"
రేపు కాటువేస్తుంది 
నిన్ను "కాలసర్పమై"....

నేడు చేసిన
ఒక మంచి కార్యం
"అకస్మాత్తుగా "పిడుగులా" పైబడు
"అనుకోని "ఒక విపత్తు" నుండి...
"అనకొండలాంటి" ఒక "ఆపద" నుండి...
"సుడిగాలిలాంటి...సునామీలాంటి"
"ఒక సమస్య" నుండి...
"కాపాడుతుంది నిన్నొక రక్షణకవచమై"

అందుకే ప్రతిమనిషి
"పాలను నీళ్ళను" వేరుచేసే
"హంస" అవతారమెత్తాలి...
"శ్రీకృష్ణ పరమాత్మలా" మారాలి
"దుష్టశిక్షణ శిష్టరక్షణ" కావించాలి...
"మంచి చెడుల" విచక్షణతో...
విజ్ఞానంతో....విశ్వానికే ఆదర్శంగా...
విలక్షణంగా...వినూత్నంగా జీవించాలి